టోల్‌ ట్యాక్స్‌ అడిగినందుకు తుపాకీతో కాల్పులు జరిపిన వ్యక్తి

Telugu Lo Computer
0


పంజాబ్ లోని జలంధర్‌-అమృత్‌సర్‌ జాతీయ రహదారిలోని ధిల్వాన్‌ టోల్‌ ప్లాజా వద్ద టోల్‌ ట్యాక్స్‌ కట్టమని అడిగినందుకు ఓ వ్యక్తి టోల్‌ ప్లాజా సిబ్బందిపై తుపాకీతో కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. దీనిపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత టోల్ ప్లాజా వద్దకు ఓ కారు వచ్చింది. టోల్‌ సిబ్బంది డ్రైవర్‌ను టోల్‌ ట్యాక్స్‌ చెల్లించాలని అడగ్గా కారులోంచి కిందకు దిగిన ఓ వ్యక్తి కాల్పులు జరపడం ప్రారంభించాడు. దీంతో టోల్‌ సిబ్బంది భయంతో అక్కడి నుంచి తప్పించుకోగా నిందితులు పరారైనట్లు ధిల్వాన్‌ ఎస్‌హెచ్‌వో దల్విందర్‌ సింగ్‌ వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)