కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర అస్వస్థత

Telugu Lo Computer
0

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమెను సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అయితే మరోవైపు మూడు రోజుల క్రితమే ఆమె ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా సోనియా గాంధీ పలు పర్యాయాలు అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. అయితే సోనియా గాంధీ కొన్ని హెల్త్ సమస్యల వల్ల సిమ్లాలోని ఆస్పత్రిలో చేరారని, వైద్యులు ప్రస్తుతం టెస్టులు చేస్తున్నారని ఆమె వ్యక్తిగత సిబ్బంది చెబుతున్నారు. ప్రస్తుతం సోనియా గాంధీ హెల్త్ స్థిరంగా ఉందని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారు నరేష్ చౌహాన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)