గోడ దూకి షూట్ కి వెళ్లిన అనుపమ్ ఖేర్ : వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన అనుపమ్ ఖేర్

Telugu Lo Computer
0


ప్రభాస్ సినిమా షూటింగ్ సెట్లో అడుగు పెట్టేందుకు అనుపమ్  ఖేర్ గోడ దూకి వెళ్లిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను స్వయంగా అనుపమ్ ఖేర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న, ఇంకా పేరు పెట్టని సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఈ సినిమాను హను రాఘవపూడి డైరెక్షన్‌లో రూపొందిస్తున్నారు. ప్రస్తుతానికి దీన్ని ఫౌజి అని సంబోధిస్తున్నారు. అయితే, అనుపం ఖేర్ ఈ సినిమా షూటింగ్ కోసం తన కారులో హోటల్ నుంచి లొకేషన్‌కు వెళ్లారు. అయితే, డ్రైవర్‌కు సరిగ్గా రూట్ తెలియకపోవడంతో, షూట్ జరుగుతున్న అల్యూమినియం ఫ్యాక్టరీలోని మరో రూట్‌లో తీసుకెళ్లాడు. అక్కడ డెడ్ ఎండ్ ఉండడంతో కార్ రివర్స్ చేయడం ఇబ్బందిగా మారింది. ఆ పక్కనే గోడ ఉండడం, గోడ పక్కనే షూట్ జరుగుతూ ఉండడంతో, యూనిట్ సభ్యులు గమనించి రెండు నిచ్చెనలు తీసుకొచ్చి ఆయనను ఒక వైపు నుంచి మరో వైపు తరలించారు. ఈ విషయాన్ని అనుపమ్ ఖేర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, తన 40 ఏళ్ల సినిమా జర్నీలో సినీ షూటింగ్ లొకేషన్స్‌కు ఎన్నో రకాలుగా వెళ్లానని, కానీ ఇది మాత్రం యూనిక్ అని చెప్పుకొచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)