ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్‌రెడ్డితో పాటు ఆయన పీఏ అలీఖాన్, బీవీ శ్రీనివాస్‌రెడ్డి, రాజగోపాల్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ నలుగురికి నాంపల్లి సీబీఐ కోర్టు విధించిన ఏడేళ్ల జైలు శిక్షను సస్పెండ్ చేసింది. దేశం విడిచి వెళ్లరాదని, రూ.10 లక్షలు సొంత పూచీకత్తు సమర్పించాలని షరతు విధించింది. పదిహేనేళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో మే 6న నాంపల్లి సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితులైన బి.వి.శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దనరెడ్డి, వి.డి.రాజగోపాల్, మెఫజ్ అలీఖాన్‌లకు ఒక్కొక్కరికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.20 వేల చొప్పున జరిమానా విధించింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన రాజగోపాల్‌కు అదనంగా 4 ఏళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు తాజా తీర్పుతో వీరికి ఊరట లభించింది.
ఓఎంసీ కేసులో గాలి జనార్దన్‌రెడ్డికి బెయిల్ మంజూరు
June 11, 2025
0
Tags