గుండెపోటుతో దర్శకుడు ఏఎస్‌ రవికుమార్‌ చౌదరి మృతి

Telugu Lo Computer
0


టాలీవుడ్ దర్శకుడు ఏఎస్‌ రవికుమార్‌ చౌదరి గుండెపోటుతో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గోపీచంద్ హీరోగా 'యజ్ఞం' సినిమాతో రవి కుమార్ దర్శకుడిగా పరిచయమ్యారు. ఆ తర్వాత బాలకృష్ణతో 'వీరభద్ర', సాయి ధరమ్‌ తేజ్‌తో 'పిల్లా నువ్వులేని జీవితం' చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆయన చివరిగా దర్శకత్వం వహించిన సినిమా 'తిరగబడరా సామి'. రవికుమార్‌ మృతికి తెలుగు దర్శకుల సంఘం సంతాపం ప్రకటించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)