దేశీయ మార్కెట్లో వివో Y400 ప్రో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.77-అంగుళాల అమోల్డ్ స్క్రీన్, మీడియాటెక్ డైమన్షిటీ 7300 ప్రాసెసర్ కలిగి ఉంది. డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌లో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరాతో రానుంది. డిస్‌ప్లే, బ్రైట్‌నెస్ 4,500 నిట్స్, వివో Y400 ప్రో డిజైన్ వంటి ఫీచర్లు లీక్ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ సైడ్ ట్విన్ కెమెరా యూనిట్ ఉంది. కెమెరాలు పిల్-షేప్ కెమెరా యూనిట్‌లో వర్టికల్‌గా ఉంటాయి. కెమెరా కింద రింగ్ లైట్ యూనిట్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లు కూడా ఉన్నాయి. వివో ఫోన్ 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాతో వస్తుంది. వివో Y400 ప్రో ఫ్రంట్ సైడ్ 32MP కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 5,500mAh బ్యాటరీ 90W ఛార్జింగ్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ 15కి సపోర్టు చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీతో రెండు వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి. వివో Y400 ప్రోలో ఏఐ నోట్ అసిస్ట్, ఏఐ సూపర్ లింక్, ఏఐ ట్రాన్స్క్రిప్ట్ అసిస్ట్ వంటి ఏఐ ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 25వేల వరకు ఉండవచ్చు. వైట్, గోల్డ్, పర్పల్ కలర్ ఆప్షన్లలో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 7.4 మి.మీ మందం ఉంటుంది.
త్వరలో వివో Y400 ప్రో విడుదల ?
June 11, 2025
0
Tags