టెస్లాకు గట్టి పోటీనిచ్చే చైనా కంపెనీ బీవైడీ తమ కొత్త ఎలక్ట్రిక్ కారు 'సీల్ 06'ను రిలీజ్ చేసింది. ఈ కారు ధర చాలా తక్కువగా ఉండడం, అలాగే ఒకసారి ఛార్జ్ చేస్తే ఎక్కువ దూరం ప్రయాణించగలగడం దీని స్పెషాలిటీ. బీవైడీ విడుదల చేసిన ఈ కొత్త కారు టెస్లా మోడల్ 3కి నేరుగా పోటీనిస్తుంది. ఈ బీవైడీ సీల్ 06 కారు సైజ్ పరంగా చూస్తే దాదాపు టెస్లా మోడల్ 3తో సమానంగా ఉంటుంది. ఈ కారు పొడవు 4720మిమి, వెడల్పు 1880మిమీ, ఎత్తు 1495మిమీ. ఈ కారులో రెండు రకాల బ్యాటరీలను అందించారు. అందులో మొదటిది 46.08kWh బ్యాటరీ. ఇది పూర్తిగా ఛార్జ్ చేస్తే 470 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.రెండోది 56.64kWh బ్యాటరీ ఇది ఒకే ఛార్జ్‌తో ఏకంగా 545 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లగలదు. సీల్ 06 ఈవీలో ఆధునిక ఫీచర్లు చాలా ఉన్నాయి. ADAS సిస్టమ్, రొటేటింగ్ సెంటర్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్,స్మాల్ డ్రైవర్ డిస్‌ప్లే స్క్రీన్ ఉంటుంది.ఇది ఎంట్రీ లెవెల్ మోడల్ అయినప్పటికీ, ఈ కారులో హీటింగ్/వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్ వంటి ఖరీదైన కార్లలో ఉండే ఫీచర్లు ఉన్నాయి. బీవైడీ ఈ కొత్త కారు చైనా మార్కెట్లో విడుదలైంది. ఈ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర 109,800 చైనీస్ యువాన్లు (మన కరెన్సీలో సుమారు రూ.13,06,789లు). మరోవైపు, చైనా మార్కెట్లో టెస్లా మోడల్ 3 RWD వెర్షన్ ధర 235,500 చైనీస్ యువాన్ల (సుమారు రూ.28,02,812లు) నుండి మొదలవుతుంది. బీవైడీ ఈ కొత్త మోడల్ ధర టెస్లా మోడల్ 3తో పోలిస్తే సగానికి సగం తక్కువగా ఉండటం విశేషం.
బీవైడీ ఎలక్ట్రిక్ కారు 'సీల్ 06' విడుదల
June 11, 2025
0
Tags