గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపాణీ మృతదేహం గుర్తింపు

Telugu Lo Computer
0


గుజరాత్‌ మాజీ సీఎం, భాజపా సీనియర్‌ నేత విజయ్‌ రూపాణీ మృతదేహాన్ని గుర్తించినట్లు గుజరాత్‌ హోంమంత్రి హర్ష్‌ సంఘ్వీ వెల్లడించారు. రూపాణీ కుటుంబ సభ్యుల నమూనాలతో మృతదేహం డీఎన్‌ఏ సరిపోలిందన్నారు. దీంతో భౌతికకాయాన్ని వారి కుటుంబసభ్యులకు అప్పగించామన్నారు. ఇప్పటిదాకా 32 మంది మృతుల డీఎన్‌ఏ వారి కుటుంబసభ్యుల జన్యు పరీక్షలతో సరిపోలినట్లు బీజే వైద్య కళాశాల సీనియర్‌ ప్రభుత్వ వైద్యుడు తెలిపారు. డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించి ఇప్పటి వరకు 14 మంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. పరీక్షతో పనిలేకుండా బంధువులు గుర్తుపట్టిన 8 మృతదేహాలను ఇప్పటికే వారి కుటుంబసభ్యులకు ఇచ్చారు. ప్రమాద తీవ్రత వల్ల చాలా వరకు గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడంతో డీఎన్‌ఏ టెస్టులు నిర్వహిస్తున్నామన్నారు. ఒక్కో పరీక్షకు ఎక్కువ సమయం పడుతుండడం గుర్తింపు ఆలస్యం అవుతోందని తెలిపారు. బాధితుల కుటుంబాలతో సమన్వయం చేసుకోవడానికి 230 బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన 11 మంది విదేశీయుల కుటుంబాలను ఇప్పటికే సంప్రదించామన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)