సాంకేతిక లోపంతో గంటపాటు రన్‌వేపై నిలిచిపోయిన ఎయిరిండియా విమానం

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ జిల్లా హిండన్‌ విమానాశ్రయంలో మరో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం సాంకేతిక లోపంతో గంటపాటు రన్‌వేపై నిలిచిపోయింది. ఎయిరిండియా విమానం ఐఎక్స్‌ 1511 ఉత్తరప్రదేశ్‌లోని హిండెన్‌ విమానాశ్రయం నుండి పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు వెళ్లాల్సి వుంది. టేకాఫ్‌కు కొద్దిసేపటి ముందు సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో గంటపాటు నిలిచిపోయింది. ఈ ఘటనపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. టేకాఫ్‌కి కొన్ని నిమిషాల ముందే సాంకేతిక లోపాన్ని గుర్తించామని, ఆలస్యం కారణంగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది. ప్రయాణికులకు రీషెడ్యూల్‌ లేదా రీఫండ్‌ చేసేందుకు సంస్థ సిద్ధంగా ఉందని ఎయిరిండియా ప్రతినిధి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సాంకేతిక సమస్య వివరాలను సంస్థ వెల్లడించలేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)