ఈడీ ద్వారా జప్తు చేయబడిన అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను బాధితులకు పంపిణీ చేయడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ ఆస్తుల మార్కెట్ విలువ సుమారు రూ. 6 వేల కోట్లుగా అంచనా వేయబడింది. డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ) హైదరాబాద్ జోన్ కార్యాలయం, అగ్రి గోల్డ్ గ్రూప్ కంపెనీలు నడిపిన పొంజీ స్కీమ్ బాధితులకు సంబంధించి రూ.611 కోట్ల విలువైన ఆస్తులను పునరుద్ధరించడం ద్వారా మరోసారి విజయాన్ని సాధించింది. అటాచ్‌మెంట్ సమయంలో వీటి విలువ రూ.611 కోట్లు కాగా, ప్రస్తుత మార్కెట్ విలువ రూ.1000 కోట్లు మించిపోయే అవకాశం ఉంది. ఈ ఏడాది మే నెలలో ఈడీ, మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002 సెక్షన్ 8(8) కింద ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిలో అటాచ్ చేసిన స్థిర, చర ఆస్తులను ఆంధ్రప్రదేశ్ సీఐడీకి విడుదల చేసి, ఆస్తులను బాధితులకు తిరిగి అప్పగించే నిమిత్తంగా ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ డిపాజిటర్ల పరిరక్షణ చట్టం, 1999 ప్రకారం పునరుద్ధరించాలని కోరింది. హైదరాబాద్‌లోని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు, ఈ పిటిషన్‌ను జూన్ 10, 2025న ఆమోదించింది. ఈ మేరకు 397 స్థిర ఆస్తుల పునరుద్ధరణకు మార్గం సుగమం అయింది. వీటిలో 380 ఆస్తులు ఆంధ్రప్రదేశ్‌లో, 13 తెలంగాణలో, 4 కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్నాయి. వీటిలో వ్యవసాయ భూములు, నివాస మరియు వాణిజ్య స్థలాలు, అపార్ట్‌మెంట్లు ఉన్నాయి.
అగ్రిగోల్డ్ ఆస్తులను బాధితులకు పంపిణీ చేయడానికి కోర్టు అనుమతి
June 13, 2025
0
Tags