ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ ని పార్టీ నాయకత్వం ఖరారు చేసింది. ప్రస్తుత అధ్యక్షురాలు పురందేశ్వరి స్థానంలో మాధవ్ ను కొత్త అధ్యక్షుడిగా ఎంపిక చేసారు. మాధవ్ ఎంపిక వెనుక భారీ కసరత్తు జరిగినట్లు తెలుస్తోంది. రేసులో పలువురు నేతలు ఉండటంతో హైకమాండ్ వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకుంది. మాధవ్ కోసం ఏపీకి చెందిన కీలక నేత క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇక, ఇప్పుడు పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన పురందేశ్వరికి ఏ పదవి దక్కనుందనేది రాజకీయంగా కీలకంగా మారుతోంది. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కోసం పలువురు ముఖ్య నేతలు పోటీ పడ్డారు. అయితే, మోడీ  - షా ద్వయం ఏపీలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వంలో ఉండటం, భవిష్యత్ రాజకీయాలకు అనుగుణంగా అధ్యక్షుడి పైన నిర్ణయం తీసుకున్నారు. దాదాపు పది మంది వరకు ఆశావాహులు పార్టీ అధ్యక్షుడి పదవి కోసం పోటీ లో ఉన్నారు. వారిలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థ సారథి, విశాఖకు చెందిన మాజీ ఎమ్మెల్సీ మాధవ్‌, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి పేర్లు ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చాయి. అయితే, బీజేపీ నాయకత్వం మాత్రం భవిష్యత్ వ్యూహాలకు అనుగుణంగా మాధవ్ ను ఎంపిక చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)