మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. తీవ్ర అనారోగ్యంతో ఆయన ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం. దీంతో ఆయనకు ఏమైందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల మమ్ముట్టి ఆరోగ్యం గురించి అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. మమ్ముట్టి క్యాన్సర్‌తో బాధపడుతున్నారనే ప్రచారం జరిగింది. అందుకే ఆయన సినిమాలకు కూడా దూరంగా ఉంటున్నారని పుకార్లు షికార్లు చేశాయి.తాజాగా దీనిపై మమ్ముట్టి సన్నిహితుడు రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ క్లారిటీ ఇచ్చారు. మమ్ముట్టికి క్యాన్సర్ అని వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన తెలిపారు. మమ్ముట్టి కేవలం చిన్న ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారని ఆయన వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ముమ్ముట్టి చికిత్స తీసుకొంటున్నారని, త్వరలోనే ఆయన పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వస్తారని ఎంపీ జాన్ బ్రిట్టాస్ తెలిపారు. క్యాన్సర్ అంటూ వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని, దయచేసి అలాంటి అసత్యాలు ప్రచారం చేయవద్దని కోరారు. మమ్ముట్టి త్వరలో పూర్తిగా కోలుకుని సినిమా షూటింగ్‌లో పాల్గొంటారని ఆయన స్పష్టం చేశారు. మమ్ముట్టి - మోహన్‌లాల్ కాంబినేషన్‌లో త్వరలో ఓ సినిమా తెరకెక్కనుంది. మహేష్ నారాయణన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.
మమ్ముట్టి ఆస్పత్రికి తరలింపు ?
June 19, 2025
0
Tags