మీ మీటింగ్‌ బనకచర్ల ప్రాజెక్టుల ఆపడానికా? కట్టుకోమనడానికా?

Telugu Lo Computer
0

హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ ప్రభుత్వంలో 946 టీఎంసీలకు ఢిల్లీ నుంచి అనుమతులు పొందామన్నారు. తాను బనకచర్లపై మీటింగ్‌ పెట్టిన తర్వాతే మీరు మీటింగ్‌ పెట్టారన్నారు. అసలు మీరు మీటింగ్‌ పెట్టింది, బనకచర్ల ప్రాజెక్టుల ఆపడానికా?, కట్టుకోమనడానికా? అంటూ సీఎం రేవంత్‌ రెడ్డిని హరీష్‌ రావు ప్రశ్నించారు. బనకచర్ల ఏ జిల్లాలో ఉందో కూడా తెలియకుండా సీఎం రేవంత్‌ రాష్ట్రాన్ని పాలిస్తున్నారన్నారు. కృష్ణ బేసిన్ లో 500 టీఎంసీలు, గోదావరి బేసిన్ లో 1000 టీఎంసీ నీళ్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ని అన్ని ప్రాజెక్ట్ లు అయిన కట్టుకోండని రేవంత్ అంటున్నారు. అసలు మన సీఎంకు తెలివి ఉందా? అని హరీష్‌ రావు మండిపడ్డారు. సీఎం రేవంత్‌ వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసే విధంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)