యోగా దినోత్సవాన్ని ఏపీ ప్రభుత్వం అద్భుతంగా నిర్వహించింది : ప్రధాని మోడీ

Telugu Lo Computer
0


కేంద్ర కేబినెట్‌ భేటీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం నిర్వహించిన యోగాంధ్రపై ప్రధాని మోడీ మాట్లాడారు. యోగా దినోత్సవాన్ని ఏపీ ప్రభుత్వం అద్భుతంగా నిర్వహించిందన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ను మెచ్చుకున్నారు. యోగాంధ్ర నిర్వహణపై నివేదిక ఇవ్వాలని ఏపీని కోరినట్లు చెప్పారు. నివేదిక వచ్చాక మిగతా రాష్ట్రాలకు పంపించి స్టడీ చేయాలని చెబుతామన్నారు. యోగాంధ్ర విజయాన్ని అందరూ కేస్‌ స్టడీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. పుణె మెట్రో రైలు విస్తరణకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. రూ.3,626 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అలాగే, ఝరియా బొగ్గు గనుల నిర్వాసితుల పునరావాసానికి రూ.5,940 కోట్లు కేటాయించింది. ఆగ్రాలో రూ.111.5 కోట్లతో అంతర్జాతీయ పొటాటో ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)