తెలంగాణ భాజపా ఎంపీ రఘునందన్‌రావుకు పీపుల్స్‌వార్ మావోయిస్టు పేరుతో బెదిరింపు కాల్ వచ్చింది. సోమవారం సాయంత్రంలోగా చంపుతామంటూ ఆగంతకుడు ఫోన్ చేశాడు. తాను మధ్యప్రదేశ్‌కు చెందిన మావోయిస్టునంటూ బెదిరించాడు. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో ఓ ప్రైవేటు పాఠశాల కార్యక్రమానికి ఎంపీ హాజరైన సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఫోన్‌కాల్‌ను రఘునందన్ పీఏ లిఫ్ట్ చేశారు. బెదిరింపు కాల్‌పై డీజీపీ, మెదక్ జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు రఘునందన్ ఫిర్యాదు చేశారు
చంపేస్తామంటూ ఎంపీ రఘునందన్‌కు బెదిరింపు కాల్
June 23, 2025
0
Tags