డ్రగ్స్ కేసులో నటుడు శ్రీరామ్ అరెస్ట్

Telugu Lo Computer
0


టుడు శ్రీరామ్ ని డ్రగ్స్ కేసులో చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీరామ్ కు వైద్య పరీక్షలు నిర్వహించి రక్త నమూనాల సేకరించారు. అనంతరం నుంగంబాక్కం స్టేషన్‌కు శ్రీరామ్ ను తరలించి చెన్నై నార్కోటిక్స్ ఇంటలిజెన్స్ యూనిట్ పోలీసులు విచారిస్తున్నారు. మాజీ ఏఐఏడీఎంకే కార్యనిర్వాహకుడు ప్రసాద్ నుండి డ్రగ్స్ కొన్నట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు శ్రీరామ్ ను అరెస్ట్ చేసారు. ఇప్పటికే ఈ డ్రగ్స్ కేసులో అన్నా డీఎంకే కార్యనిర్వాహకుడు ప్రసాద్ తో సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసారు. వారిని విచారిస్తున్న సమయంలో వారు ఇచ్చిన సమాచారంతో శ్రీరామ్ ను కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. తమిళ స్టార్ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో విజయ్ హీరోగా వచ్చిన స్నేహితులు సినిమాలో జీవాతో పాటు శ్రీరామ్ కలిసి నటించాడు. 

Post a Comment

0Comments

Post a Comment (0)