వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డిపైన క్రిమినల్ కేసు నమోదయింది. తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో రాజధాని దళిత జేఏసీ నేత, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సజ్జల రామకృష్ణారెడ్డి పైన క్రిమినల్ కేసు నమోదు చేశారు. రాజధాని మహిళలపైన జర్నలిస్టు కృష్ణంరాజు సభ్యసమాజం నివ్వెరపోయేలా తీవ్రమైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. జర్నలిస్టు కృష్ణంరాజు రాజధాని మహిళలపై చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు రాజధాని మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి రాజధాని మహిళల పైన మరోమారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి పైన కంభంపాటి శిరీష ఫిర్యాదు చేశారు. కొమ్మినేని శ్రీనివాసరావు, జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలతో తీవ్ర మనోవేదనకు గురయ్యామని, ఆ తర్వాత సజ్జలవ్యాఖ్యలు ఇంకా బాధించాయని రాజధాని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలను ఖండించాల్సిన జగన్, భారతీరెడ్డి మురికి వ్యాఖ్యలు చేసేవారిని సమర్థించడం వెనుక ఉన్న అర్థమేంటని మహిళలు ప్రశ్నించారు. సజ్జల రామకృష్ణారెడ్డి, సాక్షి యాజమాన్యంపై తుళ్లూరులో మహిళారైతులు ఫిర్యాదు చేయగా, తాడేపల్లిలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ శిరీష పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తాడేపల్లి పోలీసులు ఆయన పైన క్రిమినల్ కేసు నమోదు చేశారు. తదుపరి చర్యల పైన పరిశీలన చేస్తున్నారు. ప్రస్తుతం సజ్జల రామకృష్ణారెడ్డి పైన క్రిమినల్ కేసు నమోదు చేసిన క్రమంలో ఆయనను విచారణకు రావాలని రెండు మూడు రోజుల్లో నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇక విచారణ అనంతరం కీలక చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు
June 22, 2025
0
Tags