రేపు కూటమి ప్రభుత్వం మొదటి వార్షికోత్సవ సభ

Telugu Lo Computer
0

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పాలన ఏడాది పూర్తి చేసుకుంది. కూటమి సర్కార్ ఏడాది పాలనపై సుపరి పాలన-తొలి అడుగు పేరుతో భారీ సభను రేపు సాయంత్రం సచివాలయం వెనుక భాగంలో సభ నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులు, అధికారులు, ఉద్యోగులు హాజరుకానున్నారు. ఈ సభ ఈ నెల 12నే నిర్వహించాలని ప్రభుత్వం భావించినా అహ్మదాబాద్ భారీ విమాన ప్రమాదం నేపద్యంలో దానిని వాయిదా వేశారు. రేపటి సభలో సిఎం చంద్రబాబు ఏడాది ప్రగతి నివేదికను ప్రజల ముందు ఉంచనున్నారు. వచ్చే నాలుగేళ్లో కూటమి సర్కార్ చేపట్టబోయే ప్రగతిని వివరించనున్నారు. సుపరిపాలన, సమ్మిళిత వృద్ధికి పునరంకితం అయ్యేలా ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 12న కూటమి మొదటి వార్షికోత్సవ సభ జరగాల్సి ఉంది. కానీ ఆ రోజు అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో అది కాస్తా వాయిదా పడింది. ఈ క్రమంలో ఈ నెల 23న దీనిని నిర్వహించనున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)