హైదరాబాద్‌ నుంచి ఇథియోపియాకి విమాన సర్వీసు

Telugu Lo Computer
0


హైదరాబాద్‌ నుంచి ఆఫ్రికాకు నేరుగా మొట్టమొదటిసారి విమాన సర్వీసు ప్రారంభమైంది. శంషాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఇథియోపియా రాజధాని అడ్డిస్‌ అబాబాకు నాన్‌-స్టాప్‌ సేవలను ప్రారంభించారు. దీంతో హైదరాబాద్‌ గ్లోబల్‌ కనెక్టివిటీ మరింత బలపడింది. ఈ సేవలను ఇథియోపియన్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ నిర్వహిస్తోంది. అడ్డిస్‌ అబాబా నుంచి హైదరాబాద్‌కు సోమ, బుధ, శుక్రవారాల్లో హైదరాబాద్‌ నుంచి అడ్డిస్‌ అబాబాకు మంగళ, గురు, శనివారాల్లో సర్వీసులు నడపనున్నారు. ఈ విమాన సర్వీసుతో అడ్డిస్‌ ఇథియోపియాతో భారత వ్యాపార, పర్యాటక ప్రయాణికులకు మరింత అనుకూలత లభించనుంది. మరోవైపు భారత్‌లో వైద్యం చేయించుకునేందుకు ఆఫ్రికాలోని ఇథియోపియా, నైజీరియా, టాంజానియా, ఉగాండా, రువాండా, జాంబియా, కేమరూన్‌, కెన్యా దేశాల నుంచి అనేక మంది రోగులు వస్తుంటారు. అలాంటి వారికి ఈ విమాన సర్వీసు ఉపయుక్తంగా ఉండనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)