లొంగిపోవడం కంటే చనిపోవడం మేల, కిందకు దూకేస్తా : పోలీసులను బెదిరించి క్రిమినల్

Telugu Lo Computer
0


గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పలు కేసుల్లో వాంటెడ్ క్రిమినల్ అయిన అభిషేక్ అలియాస్ 'షూటర్' చాలా కాలంగా అరెస్టు నుంచి తప్పించుకున్నాడు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతడి కోసం వెతుకుతున్నారు. కాగా, శివమ్ ఆవాస్‌లోని అపార్ట్‌మెంట్‌లో అభిషేక్‌ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో శనివారం క్రైమ్ బ్రాంచ్ బృందం అక్కడకు చేరుకున్నది. పోలీసులను చూసిన అభిషేక్‌ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. బిల్డింగ్‌ ఐదో అంతస్తులోని గట్టుపైకి చేరుకున్నాడు. 'నాతో ఎలా ప్రవర్తిస్తారో నాకు తెలుసు. అది నిజంగా దారుణంగా ఉంటుంది. లొంగిపోవడం కంటే చనిపోవడం మేలు. కిందకు దూకేస్తా ' అని బెదిరించాడు. పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ అక్కడి నుంచి పైకి రాలేదు. తన మొబైల్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ చేశాడు. మరోవైపు స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడారు. చివరకు పోలీసులు ఫైర్ సిబ్బందిని రప్పించి వలల సహాయంతో అభిషేక్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. సుమారు మూడు గంటలపాటు సాగిన ఈ హైడ్రామాకు సంబంధించిన వీడియో క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)