మోహన్ బాబు కాళ్లకు దండం పెట్టిన బ్రహ్మానందం !

Telugu Lo Computer
0


మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో మోహన్ బాబు అలాగే నటుడు బ్రహ్మానందం మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తాను మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దని, బ్రహ్మానందం అనగా మోహన్ బాబు చేతులెత్తి దండం పెట్టేసారు. ఈ నేపథ్యంలోనే బ్రహ్మానందం ఇచ్చిన హావాభావాలకు ఫ్యాన్స్ కూడా సంబరపడిపోయారు. డైలాగ్ చెప్పడంతో మోహన్ బాబు కింగ్ అంటూ బ్రహ్మానందం ఆయనను ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే మంచు మోహన్ బాబు కాళ్లు పట్టుకున్నారు బ్రహ్మానందం. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీంతో సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)