సైనికులకు క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ కార్బైన్‌లు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ అత్యాధునిక గన్ ల తయారీ కోసం సైన్యం డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్, భారత్ ఫోర్జ్ లిమిటెడ్‌లకు ఆర్డర్ ఇచ్చింది. ఆర్మీ రూ.2 వేలకోట్ల విలువైన ఒప్పందానికి సంబంధించి డీఆర్డీవో, భారత్ ఫోర్జ్ లిమిటెడ్ ఎల్-1 బిడ్డర్స్‌గా ఎంపికయ్యాయి. 5.56×45 mm CQB కార్బైన్‌ను డీఆర్డీవో ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్, భారత్ ఫోర్జ్ లిమిటెడ్ రూపొందించాయి. ఈ కార్బైన్‌ను భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ అయిన కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్‌కు చెందిన పుణే యూనిట్ లో ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నది. భారత సైన్యం ప్రస్తుతం 1940లో రూపొందించిన సబ్-మెషిన్ గన్ అయిన స్టెర్లింగ్ కార్బైన్‌ను ఉపయోగిస్తోంది. సైన్యం చాలా కాలంగా స్టెర్లింగ్ కార్బైన్‌ను భర్తీ చేయడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుత యుద్ధ పరిస్థితులకు స్టెర్లింగ్ కార్బైన్ సరిపోతదని సైన్యం భావించింది. ఈ క్రమంలోనే చాలారోజుల నుంచి క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ కార్బైన్స్ కోసం ప్రయత్నిస్తున్నది. పూణేలోని డీఆర్డీవో ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ కొత్త కార్బైన్‌ను రూపొందించాలని నిర్ణయించుకుంది. 5.56×45 mm CQB కార్బైన్ చిన్న, తేలికపాటి కార్బైన్ కావడంతో ఎన్‌కౌంటర్లలో ఖచ్చితమైన ప్రతిస్పందన ఇవ్వనుండగా.. ఇందులో అనేక ఆధునిక ఫీచర్స్ ఉన్నాయి. ఆప్టిక్స్, లేజర్ డిజిగ్నేటర్స్ తదితర యాక్సెసరీస్ డిజైన్‌ల ఇన్‌స్టాల్ చేయబడి ఉంటాయి. ఈ డీల్‌లో దాదాపు 4లక్షలకుపైగా గన్స్ తయారు చేసి సైన్యానికి అందించనున్నట్లు తెలుస్తున్నది.
త్వరలో సైన్యానికి క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ కార్బైన్ తుపాకీలు
June 23, 2025
0
Tags