ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు ఆర్వీఆర్ జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీసు ఏఐ హ్యాకథాన్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. పోలీసుశాఖలో కృత్రిమమేధ వినియోగంపై మూడు రోజుల పాటు హ్యాకథాన్ కొనసాగనుంది. తొలుత అమరావతి నుంచి హెలికాప్టర్‌లో గుంటూరు చేరుకొన్న చంద్రబాబుకు.. కొత్తపాలెంలోని జిందాల్ ఫ్యాక్టరీ వద్ద గుంటూరు జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, హోం మంత్రి వంగలపూడి అని, డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా, పలువురు ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
పోలీసు ఏఐ హ్యాకథాన్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
June 27, 2025
0
Tags