వదినను చంపి తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన మరిది

Telugu Lo Computer
0

శ్చిమ బెంగాల్ లోని దక్షిణ 24 పరగణాస్ జిల్లా బసంతి టౌన్ లో గతకొంత కాలం నుంచి బిమల్ కుటుంబానికి ఆమె వదిన కుటుంబానికి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బిమల్, అతడికి, వదినకు శనివారం కూడా గొడవ జరిగింది. గొడవ తారాస్థాయికి చేరటంతో బిమల్ ఆగ్రహంతో పదునైన కత్తితో వదినపై దాడిచేసి చంపేశాడు. ఆమె శరీరం నుంచి తలను వేరు చేసి  తలను ఓ చేత్తో, మరో చేత్తో కత్తిని పట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ పోలీస్ స్టేషన్ వెళ్లాడు. అతడు తలను పట్టుకుని నడవటం చూసి జనం షాక్‌ కు గురైయ్యారు. కొంతమంది భయంతో దూరంగా పరుగులు తీశారు. మరికొంతమంది వీడియోలు తీసుకోవటం కోసం అతడ్ని ఫాలో అయ్యారు. బిమల్ ఎవర్నీ పట్టించుకోకుండా నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్లి తలను, కత్తిని పోలీసులకు స్వాధీనం చేసి, లొంగిపోయాడు. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)