బీహార్‌లోని వైశాలి, మహువాలోని ఒక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. అతను ఓ మహిళా టీచర్‌తో అసభ్యకర స్థితిలో ఉన్న సీసీటీవీ వీడియో బయటపడింది. పాఠశాల ప్రయోగశాల లోపల ఒక మంచం ఏర్పాటు చేసుకొని ఇద్దరు కాపురం పెట్టారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఆ ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేసి, అతనిపై శాఖాపరమైన విచారణ జరపాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. ప్రధానోపాధ్యాయుడితో పాటు మహిళా ఉపాధ్యాయురాలిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైశాలి ప్రోగ్రామ్ ఆఫీసర్ హర్పూర్ మీర్జానగర్ హయ్యర్ సెకండరీ స్కూల్ యాక్టింగ్ హెడ్‌మాస్టర్ హేమంత్ కుమార్‌ను తన పదవి నుండి సస్పెండ్ చేశారు. అదే పాఠశాలలో పని చేస్తున్న మహిళా ఉపాధ్యాయురాలితో అతని ప్రవర్తనకు సంబంధించి ఈ-శిక్ష కోష్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదైంది. ఆధారాలతో సహా పోర్టల్‌లోని అధికారికి ఫిర్యాదు అందింది. దీని తరువాత వెంటనే, జిల్లా విద్యాశాఖ అధికారి ఈ విషయంపై చర్య తీసుకొని ఈ విషయంపై దర్యాప్తు చేయాలని మహువా బ్లాక్ విద్యాశాఖాధికారిని ఆదేశించారు. బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అర్చన కుమారి ఈ విషయాన్ని పరిశీలించడానికి పాఠశాలకు చేరుకుని ప్రశ్నించడం ప్రారంభించినప్పుడు, పాఠశాలలోని ఉపాధ్యాయులు ఏం చెప్పలేదు. పాఠశాల వాచ్‌మెన్‌ను ప్రశ్నించినప్పుడు, అతను ప్రయోగశాల తాళాలు తన వద్ద లేవని చెప్పాడు. ప్రయోగశాల తాళాలు ప్రధానోపాధ్యాయుడి వద్దే ఉన్నాయి. ప్రయోగశాల తాళాలను తీసుకొని పరిశీలించగా, దాని లోపల ఒక మంచం కనిపించింది. పాఠశాల లోపల ఒక బెడ్‌రూమ్ ఏర్పాటు చేసుకొని, అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నట్లు తేలింది.
పాఠశాల ప్రయోగశాలలో మంచం ఏర్పాటు చేసుకొని టీచర్‌తో హెడ్ మాస్టర్ రాసలీలలు
June 01, 2025
0
Tags