అమెరికా లోని హార్వర్డ్ యూనివర్శిటీలోకి విదేశీ విద్యార్ధులు చేరకుండా చేసేందుకు ట్రంప్ సర్కార్ విధించిన ఆంక్షల్ని సవాల్ చేస్తూ వర్శిటీ కోర్టును ఆశ్రయించింది. ట్రంప్ సర్కార్ ఆంక్షల్ని కోర్టులో సవాలు చేసింది. దీనిపై విచారణ జరిపిన స్థానిక ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి వాటిని తాత్కాలికంగా పక్కనబెట్టాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో ట్రంప్ సర్కార్ తో హార్వర్డ్ వర్సిటీ సాగిస్తున్న న్యాయ పోరాటంలో గొప్ప ఊరట దక్కినట్లు భావిస్తున్నారు. ట్రంప్ సర్కార్ ఆదేశాలు అమల్లోకి వస్తే హార్వర్డ్ యూనివర్శిటీకి కోలుకోలేని దెబ్బ తగులుతుందని ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. దీంతో సదరు ఉత్తర్వులపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. హార్డర్డ్ విశ్వవిద్యాలయం విదేశీ విద్యార్థుల నమోదును నిలిపివేయాలని ట్రంప్ సర్కార్ ఇచ్చిన ఆదేశాన్ని సవాలు చేస్తూ మే 23న ఇచ్చిన ఉత్తర్వుల్ని హార్డర్డ్ సవరించింది. ఇప్పుడు కోర్టు ఉత్తర్వు కూడా హార్డర్డ్ కు అనుకూలంగా రావడంతో ట్రంప్ సర్కార్ ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
హార్వర్డ్ వర్శిటీపై డొనాల్డ్ ట్రంప్ దూకుడుకు కోర్టు బ్రేక్
June 06, 2025
0
Tags