అమెజాన్‌లో ఐఫోన్ 15 ధర తగ్గింపు ఆఫర్

Telugu Lo Computer
0


మెజాన్‌లో 128జీబీ స్టోరేజ్ ఉన్న ఐ ఫోన్ 15 ధర తగ్గింపును ప్రకటించారు. ఇది 15 శాతం తగ్గింపుతో ఐఫోన్‌లకు అరుదైన ఆఫర్. అమెజాన్‌లో దాదాపు రూ. 10,000 వరకు తగ్గింపు ఉంది, ఎటువంటి బ్యాంక్ ఆఫర్లు లేవు. ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్ 128GB వేరియంట్ అసలు ధర రూ.69,900. దీని నుండి ధర దాదాపు రూ. 10,000 వరకు తగ్గింది. 128GB స్టోరేజ్ ఉన్న బ్లూ కలర్ వేరియంట్ రూ.59,700కి అమ్ముడవుతోంది. పింక్ కలర్ కి అమెజాన్ లో అదే ధర లభిస్తుంది. గ్రీన్, బ్లాక్ కలర్స్‌లో ఉన్న ఫోన్ ధర రూ.59,900. ఈ ప్రీమియం హ్యాండ్‌సెట్‌పై అమెజాన్ ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లను అందిస్తోంది. చాలా మంచి ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఫోన్ కొనుగోలు సమయంలో మీరు రూ.1,782 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)