పాకిస్తాన్ లో హైస్కూల్ పై బాంబు దాడి

Telugu Lo Computer
0


పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్ టాంక్ జిల్లాలోని గుల్ ఇమామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్బారీ గ్రామంలోని ఓ హైస్కూల్ పై ఈరోజు బాంబు దాడి జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు ఈ బాండు దాడికి పాల్పడినట్లు సమాచారం. అక్బారీ గ్రామంలోని ఓ ప్రభుత్వ హైస్కూల్ పై దుండగులు జరిపిన బాంబు దాడిలో పాఠశాల పూర్తిగా ధ్వంసం అయింది. స్కూల్ లోని గదులు ధ్వంసం అయ్యాయి. అయితే తామే ఈ దాడికి పాల్పడినట్లు ఇప్పటివరకూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. కానీ తెహ్రీక్-ఈ- తాలిబాన్ అనే ఉగ్రవాద సంస్థ టాంక్ జిల్లాలో యాక్టివ్ గా ఉన్నట్లు సమాచారం. ఈ ఉగ్రవాద సంస్థే దాడికి పాల్పడినట్లు సమాచారం అందుతోంది. స్థానిక ఎన్జీఓలు అందించిన సమాచారం మేరకు ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్ లో గత పదేళ్లలో 450 పాఠశాలలపై బాంబు దాడులు జరిగినట్లు తెలుస్తోంది. విద్యార్థులు పాఠశాలలకు హాజరు కాకుండా ఇలా చేస్తున్నాయి ఉగ్రవాద సంస్థలు. 2019 వరకు పాకిస్థాన్ లోని అనేక గర్ల్స్ స్కూళ్లపై దాడులు జరిగాయి. స్వాట్ వ్యాలీతో పాటు నార్త్ వెస్ట్ పాకిస్తాన్ ప్రాంతంలో ఈ దాడులు అధికంగా నమోదయ్యాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)