ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులు : 8 మంది మృతి, 200 మందికి పైగా గాయాలు

Telugu Lo Computer
0


రాన్ ఇంధన, రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేసింది. దీనికి ప్రతిగా ఇరాన్ మరోసారి క్షిపణులతో దాడులకు దిగింది. ఈ దాడుల్లో నలుగురు వ్యక్తులు చనిపోయారని ఆరోపించింది. గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులతో చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. త్వరలోనే ఈ యుద్ధంలోకి అమెరికా రంగ ప్రవేశం చేసే అవకాశాలున్నాయి. ఇరాన్ లోని సైనిక, ఆయుధ స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. రెండు రోజులుగా జరుగుతున్న దాడుల్లో 9 మంది అధికారులు, శాస్త్రవేత్తలు మృతిచెందారు. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 78 మంది మృతిచెందగా వందల మంది గాయపడ్డారు. అందుకు ప్రతీకారంగా ఇరాన్ సైతం డ్రోన్స్, మిస్సైల్స్‌తో విరుచుకుపడుతోంది. కానీ ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థ ఆ దాడులను అడ్డుకోవడంలో విఫలమవుతోంది. శనివారం రాత్రి, ఆదివారం ఉదయం జరిగిన దాడుల్లో శిధిలా కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇరాన్ ప్రయోగిస్తున్న క్షిపణులు ఇజ్రాయెల్ లోకి ప్రవేశించిన సమయంలోనే టెహ్రాన్ అంతటా కొత్తగా పేలుళ్లు సంభవించాయి. ఈ దాడిలో గెలీలీ ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్ భవనంలో నలుగురు మరణించారని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. ఇరాన్, ఇజ్రాయెల్ తాజా దాడులను నిలిపివేయాలని ఐక్యరాజ్యసమితి సైతం పిలుపునిచ్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)