సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ రాజధాని బంగుయ్‌లోని బార్తెలెమీ బోగాండా హై స్కూల్‌లో ఈరోజు ఘోర ప్రమాదం జరిగింది. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు విద్యుత్ సరఫరా పునరుద్ధరించే సమయంలో ఒక భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా విద్యార్థులు భయంతో పరుగులు తీయగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 29 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. 260 మందికి పైగా గాయపడ్డారు. బాధితుల్లో 16 మంది బాలికలు ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 5,000 మంది విద్యార్థులు పరీక్షల కోసం అక్కడకి వచ్చారు. ఈ ఘటనపై ఆ దేశ విద్యా మంత్రిత్వ శాఖ విచారణ ప్రారంభించింది. గాయపడిన విద్యార్థుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ లో 26 మంది విద్యార్థులు మృతి
June 26, 2025
0
Tags