దేశవ్యాప్తంగా వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాలకు మే 4న నిర్వహించిన పరీక్షల నిర్వహించగా తాజాగా వాటి ఫలితాలు విడుదల చేశారు. ఈ ఏడాది 22.7 లక్షలకు పైగా అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. తెలంగాణలో 190 కేంద్రాల్లో 72,507 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. రాష్ట్రంలో 33 ప్రభుత్వ, రెండు డీమ్డ్ యూనివర్సిటీలతో కలిపి 29 ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వాటిలో మొత్తం 8,515 ఎంబీబీఎస్ సీట్లుండగా... అందులో 400 వరకు డీమ్డ్ యూనివర్సిటీల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఈ ఏడాది నీట్ పరీక్షకు 20.8 లక్షల మంది హాజరయ్యారు. గతేడాది ఆ సంఖ్య 23.33 లక్షలుగా ఉంది. ఈ ఏడాది దరఖాస్తు చేసిన వారిలో 91.4 శాతం మంది పరీక్ష రాసినట్లు కేంద్రం వెల్లడించింది.
నీట్ యూజీ 2025 విడుదల
June 14, 2025
0
Tags