మరోసారి ఏఐజీ ఆసుపత్రికి కేసీఆర్‌

Telugu Lo Computer
0


తెలంగాణ మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్‌ శనివారం మరోసారి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. వైద్య పరీక్షల కోసం అక్కడికి చేరుకున్నారు. మరోవైపు సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగా కేసీఆర్‌ శుక్రవారం కూడా ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆసుపత్రికి వచ్చిన ఆయన గంట పాటు అక్కడే ఉన్నారు. ఏఐజీ ఛైర్మన్, ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యులు డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్‌కు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేకపోయినా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)