గత రెండు రోజుల్లో రూ. 15,300 తగ్గిన బంగారం ధర

Telugu Lo Computer
0


గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు రూ. 15,300కు తగ్గాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరిగినట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో బంగారం ధరలు నేల చూపులు చూశాయి. కాగా పెట్టుబడిదారులు ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం వదిలేసి యూస్ డాలర్ మీద ఇప్పుడు దృష్టి సారించారు. దీంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. రానున్న కాలంలో ఈ ధరలు మరింతగా తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయతే ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మళ్లీ వార్ మొదలయ్యే సూచనలు కనిపిస్తుండటంతో బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని పలువురు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం స్వచ్ఛమైన పెట్టుబడి-గ్రేడ్ బంగారం అయిన 24 క్యారెట్ బంగారం ధర గ్రాముకు రూ.9,895 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ బంగారం గ్రాముకు రూ. 9,070 వద్ద ట్రేడ్ అవుతుండగా 18 క్యారెట్ బంగారం గ్రాముకు రూ. 7,421 వద్ద ట్రేడ్ అవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)