తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టులకు అమెరికాలోని బోస్టన్‌కు చెందిన ఎన్నారై భాగవతుల ఆనంద్ మోహన్ భారీ విరాళాలు అందజేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుని తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో కలిసి విరాళాల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆయన సేవా మనోభావాన్ని కొనియాడారు. తిరుమల శ్రీవారి సేవలో భాగంగా ఎన్నారైలు ఇటువంటి విరాళాలు ఇవ్వడం పట్ల దేవస్థానం కృతజ్ఞతలు తెలిపింది. ఆనంద్ మోహన్ రూ.1,40,05,696 విలువైన విరాళాలను పలు ట్రస్టులకు పంపిణీ చేశారు. వాటిలో ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ - రూ.1,00,01,116, ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్ - రూ.10,01,116, ఎస్వీ విద్యాదాన ట్రస్ట్ - రూ.10,01,116, ఎస్వీ వేదపరిరక్షణ ట్రస్ట్ - రూ.10,01,116, ఎస్వీ సర్వశ్రేయస్ ట్రస్ట్ - రూ.10,01,116.
టీటీడీ ట్రస్టులకు భారీ విరాళం ఇచ్చిన ఎన్ఆర్ఐ భాగవతుల ఆనంద్ మోహన్
May 15, 2025
0
Tags