ఆంధ్రప్రదేశ్ లో రేషన్ షాపులు తెరిచి ఉంచే తేదీలు, సమయాల్ని ప్రభుత్వం ప్రకటించింది. వీటి ప్రకారమే జూన్ నెల నుంచి బియ్యం కార్డు దారులు సరుకులు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తేదీ దాటిపోతే సరుకులు తీసుకోవడం కష్టమవుతుంది. దీంతో రేషన్ కార్డు దారులు కొత్తగా రేషన్ షాపుల్లో రేషన్ ఇవ్వబోయే తేదీలు, సమయాల్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ షాపుల్లో జూన్ 1 నుంచి 15వ తేదీ వరకూ రేషన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ రేషన్ పంపిణీ చేయబోతున్నారు. ఇప్పటివరకూ రేషన్ వాహనాల్లో రేషన్ ఇచ్చేవారు. ఇప్పుడు రేషన్ షాపుల్లోనే ఇస్తారు కాబట్టి వాటి తేదీలు, సమయాలను గుర్తుపెట్టుకుని వెళ్లాల్సి తీసుకోవాల్సి ఉంటుంది. రేషన్ డీలర్లను ప్రభుత్వం ఈ సమయాలు, తేదీలను లబ్దిదారులకు తెలియజేసేందుకు వాట్సాప్ గ్రూపులు కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. దీంతో త్వరలోనే వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి అందులో లబ్దిదారులను యాడ్ చేస్తారు. ఆ తర్వాత అందులోనే మార్పులు, చేర్పులు ఏవైనా ఉంటే సమాచారం ఇస్తారు.
ఆంధ్రప్రదేశ్ లో రేషన్ షాపులు తెరిచి ఉంచే తేదీలు, సమయాల్ని ప్రకటించిన ప్రభుత్వం
May 29, 2025
0
Tags