తిరుమలలో మద్యం మత్తులో ఏపీఏఎస్పీ ఏపీఏఎస్పీ బెటాలియన్ పోలీసులు హల్ చల్

Telugu Lo Computer
0


తిరుమలలో మద్యం మత్తులో ఏపీఏఎస్పీ బెటాలియన్ పోలీసులు హల్ చల్ చేశారు. మద్యం మత్తులో సచివాలయం వద్ద తమ వాహనంతో, మరో వాహనాన్ని ఢీకొట్టారు. వేగంగా వాహనాన్ని ఢీకొట్టడంతో ఢీకొట్టడంతో టైరు కూడా పంక్చర్ అయింది. ముగ్గురు పోలీసులు మద్యం సేవించి, పోలీసు వాహనంలో శుక్రవారం తిరుమలకు చేరుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలం నుంచి ఒక్కరు పరారయ్యారు. డ్రైవింగ్ చేసిన వారికి డ్రంక్ డైవ్ టెస్ట్ చేయగా 300 పాయింట్లు చూపించినట్లు సమాచారం. వెంటనే పోలీసులు స్పందించి ఇద్దరు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకున్నారు. హల్ చల్ చేసిన పోలీసులు సస్పెండ్ అయ్యారు. ఈ ఘటనను పోలీసు శాఖ సీరియస్ గా తీసుకుంది. మద్యం మత్తులో తిరుమలలో వాహనం నడవడంతోపాటు యాక్సిడెంట్ చేసిన పోలీసులను రాజశేఖర్, ఓంకార్ నాయక్, షేక్ సరావుద్దీన్ లుగా గుర్తించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)