విజయవాడలో విద్యుద్ఘాతానికి ముగ్గురు బలి

Telugu Lo Computer
0


విజయవాడలోని బెంజ్ సర్కిల్ సమీపంలో శనివారం తెల్లవారుజామున ఒక భవనంలో విద్యుద్ఘాతానికి గురై ముగ్గురు మృతి చెందారు. ప్రమాదంపై సమాచారం అందుకున్నపోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాల్ని పోస్టుమార్టంకు తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉండగా ఒక మహిళను ముత్యాలమ్మగా గుర్తించారు. ఒకరు కరెంట్ షాక్ కు గురవ్వగా ఆ వ్యక్తిని కాపాడబోయి మరో ఇద్దరు కూడా కరెంట్ షాక్ కు గురై అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)