ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా సీకే దిన్నె మండలం గువ్వల చెరువు ఘాట్ మలుపు వద్ద లారీ కారు పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి, ఒక పురుషుడు ఉన్నారు. రాయచోటి నుంచి కడప వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. లారీ ఓవర్ స్పీడే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం.
కడప జిల్లాలో లారీ కారు పైకి దూసుకెళ్లిన గతంలో ఐదుగురు మృతి
May 24, 2025
0
Tags