తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇసకపల్లి రాజుపై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అరెస్టు చేసి తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంలో శనివారం రాత్రి రాజుపై నందిగం సురేశ్, ఆయన సోదరుడు ప్రభు దాసు, బంధువులు దాడి చేశారు. దాడి ఘటనపై రాజు కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఉద్దండరాయునిపాలెం వెళ్లి సురేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. శనివారం రాత్రి ఉద్దండరాయునిపాలెంలోకి వేగంగా కారు దూసుకొచ్చింది. కారు అతివేగంపై డ్రైవర్‌ను రాజు మందలించారు. అక్కడికి కాసేపటి తర్వాత సురేశ్ అనుచరులు వచ్చి అతడిపై దాడి చేసి.. సురేశ్ ఇంటికి బలవంతంగా తీసుకెళ్లారు. అక్కడ మరోసారి సురేశ్, అతడి అన్న ప్రభుదాసు, బంధువులు రాజుపై దాడి చేశారు. గాయాలపాలైన రాజుని కుటుంబ సభ్యులు మంగళగిరి ఎయిమ్స్‌లో చేర్చారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. మరోవైపు సురేశ్ సోదరుడు, బంధువుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తెదేపా కార్యకర్తపై దాడి కేసులో నందిగం సురేశ్ అరెస్టు
May 18, 2025
0
Tags