తెలంగాణలోని మేడ్చల్ జిల్లా చర్లపల్లిలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు పెట్రోల్ ట్యాంకర్‌కు మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన డ్రైవర్ ట్యాంకర్‌ను నిలిపివేశాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న మరో పెట్రోల్ ట్యాంకర్, గ్యాస్ ట్యాంకర్లకు మంటలు అంటుకున్నాయి. సంఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.
చర్లపల్లి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వద్ద అగ్ని ప్రమాదం
May 18, 2025
0
Tags