పాకిస్తాన్లో భూకంపం సంభవించింది. పలు నివాసాలు బీటలు వారినట్లు సమాచారం అందుతోంది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2గా రికార్డయింది. ఈ సాయంత్రం సరిగ్గా 4 గంటలకు భూమి ప్రకోపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ వెల్లడించింది. ఖైబర్ ఫక్తున్ఖ్వా ప్రావిన్స్‌లో ఛిత్రాల్ జిల్లాలో ఈ భూకంపం సంభవించింది. ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల దిగువన టెక్టానిక్ ప్లేట్స్లల్లో చోటు చేసుకున్న కదలికల వల్ల భూమి కంపించింది. ఆఫ్ఘనిస్తాన్, తజకిస్తాన్ సరిహద్దుల్లో ఉంటుందీ ఛిత్రాల్ జిల్లా. దీని ప్రకంపనలు ఈ రెండు దేశాల్లో నమోదయ్యాయి. భూకంపం సంభవించిన వెంటనే స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు.
పాకిస్తాన్లో భూకంపం !
May 05, 2025
0
Tags