సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో పాన్ ఇండియా రెబల్ స్టార్ హీరోగా నటించనున్న 'స్పిరిట్' చిత్రం ఇప్పుడు హీరోయిన్ విషయంలో హాట్ టాపిక్ అయింది. ఈ సినిమా నుంచి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తప్పుకున్నారు. ఆ స్థానంలో యానిమల్ ఫేమ్ తృప్తి డిమ్రిని సందీప్ తీసుకున్నారు. ఈ విషయంపై తాజాగా వివాదం మొదలైంది. స్పిరిట్ స్టోరీని లీక్ చేశారని, విలువలు లేవా అని సందీప్ ప్రశ్నించారు. దీపక పదుకొణ్ గురించే సందీప్ రెడ్డి వంగా ట్వీట్ చేశారని అర్థమవుతోంది. స్పిరిట్ కథను లీక్ చేసిందని సందీప్ పేర్కొన్నారు. తన కంటే చిన్నవయసు నటిని ఆ రోల్ కోసం తీసుకుంటే కక్షపూరితంగా ఇలా చేయడం ఫెమినిజమా అని సందీప్ ప్రశ్నించారు. తాను ఏళ్లపాటు కష్టపడ్డానని, నీకు అర్థం కాదంటూ ఘుటుగా రాసుకొచ్చారు. "నేను స్టోరీని ఓ యాక్టర్‌కు నరేట్ చేసేటప్పుడు వారిపై వంద శాతం నమ్మకం ఉంచుతా. కథను బయట ఎక్కడా చెప్పకూడదని మాటతోనే అగ్రిమెంట్ ఉంటుంది. కానీ నువ్వు కథను బయటికి చెప్పేశావ్. అలాంటి వ్యక్తివి నువ్వు. ఓ యువ నటిని చిన్నబోయేలా చేయడం, నా కథను బయటపెట్టడం? ఇదేనా నీ ఫెమినిజానికి అర్థం?" అని సందీప్ రెడ్డి వంగా ప్రశ్నించారు. ఈసారి పూర్తి స్టోరీ చెప్పేయ్, నాకు తేడా ఉండదంటూ సందీప్ ఫైర్ అయ్యారు. "ఓ ఫిల్మ్‌మేకర్‌గా నా క్రాఫ్ట్ గురించి నేను సంవత్సరాల పాటు కష్టపడతా. ఫిల్మ్‌మేకింగే నాకు అన్నీ. నీకు ఇది అర్థం కాదు. ఎప్పటికీ అర్థం కాదు. ఈసారి ఏం చేస్తావంటే.. పూర్తి కథ చెప్పేయ్. నాకేమీ తేడా పడదు" అని సందీప్ రెడ్డి వంగా ట్వీట్ చేశారు. అసూయను బయటపెడుతోదంటూ రాసుకొచ్చారు. డర్టీపీఆర్ గేమ్స్ అంటూ సందీప్ హ్యాష్ ట్యాగ్ పెట్టారు. స్పిరిట్ సినిమా నుంచి దీపికా పదుకొణ్ తప్పుకున్న తర్వాత రకరకాల వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో హీరోతో హీరోయిన్ బోల్డ్ సీన్లు ఉన్నాయని, ఏ రేటెడ్ కంటెంట్ ఉంటుందని సమాచారం చక్కర్లు కొట్టింది. దీపిక తన పీఆర్ టీమ్ నుంచి స్టోరీలోని ఈ విషయాలను లీక్ చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ కారణంగానే తప్పుకున్నట్టు ప్రచారం చేశారని తెలుస్తోంది. అలాగే, గతేడాదే పుట్టిన తన కుమారుడిని చూసుకునేందుకు దీపిక ఈ చిత్రం నుంచి వైదొలిగారని ప్రచారాలు వచ్చాయి. సందీప్ రెడ్డి వంగా ప్రవర్తన నచ్చకనే తప్పుకున్నారనే మరో రూమర్ వచ్చింది. దీంతో విసుగెత్తిన సందీప్.. డర్టీపీఆర్ గేమ్స్ అంటూ విరుచుకుపడుతూ ట్వీట్ చేశారు. రెమ్యూనరేషన్‍తో పాటు స్పిరిట్ సినిమా లాభాల్లోనూ దీపిక వాటా అడిగారని తెలుస్తోంది. అలాగే డేట్స్ ఇచ్చి తక్కువ గంటలే పని చేస్తానని, తన టీమ్ జీతాలు కూడా నిర్మాతలే ఇవ్వాలనే కండీషన్ పెట్టారట. దీంతో సందీప్ రెడ్డి వంగానే దీపికను వద్దనుకున్నారనే టాక్ కూడా ఉంది. బాలీవుడ్‍లో డామినేషన్ ఉన్న స్టార్ అని తెలిసి కూడా ఇలా నిజాలు బయటికి చెప్పిన సందీప్ ధైర్యాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
నా కథను బయటపెట్టమే నీ ఫెమినిజామా ? : హీరోయిన్‍పై సందీప్ రెడ్డి వంగా ఫైర్
May 27, 2025
0
Tags