ఆకాశంలో భారీ కుదుపులకు లోనైన ఇండిగో విమానం : వీడియోలు వైరల్

Telugu Lo Computer
0


ఇండిగో విమానం ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్నసమయంలో   ప్రతికూల వాతావరణం కారణంగా గాల్లో ఉండగానే భారీ కుదుపులకు లోనైంది. ఆ సమయంలో విమానంలో 200 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. దీంతో వారంతా భయాందోళనకు గురయ్యారు. పెద్దలు, చిన్నారులు కేకలు పెడుతూ గట్టిగా సీట్లను పట్టుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కూర్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారడంతో, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో తీవ్ర ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు బయలుదేరిన ఇండిగో విమానం ప్రతీకూల వాతావరణం కారణంగా తీవ్ర కుదుపులకు లోనైంది. వెంటనే ఎమర్జెన్సీ ప్రకటించిన పైలట్, శ్రీనగర్ ఏటీసీకి సమాచారం ఇచ్చారు. దీంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు చర్యలు చేపట్టారు. చివరకు విమానం సురక్షితంగా దిగడంతో ప్రయాణికులు, విమాన సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. విమానయాన సంస్థ ఎటువంటి నష్టాన్ని పేర్కొనలేదు. కానీ, సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో, ఫొటోల ప్రకారం విమానం ముందు భాగంలో భారీగా డ్యామేజ్ అయింది.

Post a Comment

0Comments

Post a Comment (0)