ఆకుకూరల్లో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి, కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. ఇవి శరీరానికి శక్తినిస్తాయి. ప్రతి రోజు శరీరం పని చేయడానికి అవసరమైన పోషకాలు ఆకుకూరలతో లభిస్తాయి. ఆకుకూరలు కనీసం వారానికి కొన్ని రోజులు ఆహారంలో చేర్చుకోవాలి. ఎందుకంటే ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆకుకూరలు తినడం వల్ల మలబద్ధక సమస్య తగ్గుతుంది. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు సమస్యలు తగ్గుతాయి. రోజూ తినలేకపోయినా వారానికి కొన్ని రోజులు తప్పక తినాలి. వారానికి కనీసం మూడు సార్లు ఆకుకూరలు తినడం మంచిది. ఉదయం లేదా రాత్రి భోజనాల్లో చేర్చుకోవచ్చు. ఇలా చేయడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. ఎముకలు బలపడతాయి. శరీరం సరిగా పనిచేస్తుంది.ఆకుకూరలు తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండెకు మేలు జరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చర్మం బాగా మెరుస్తుంది. కేశాలు బలంగా ఉంటాయి. సంతాన సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. పిల్లలకి చిన్ననాటి నుంచే ఆకుకూరలు తినే అలవాటు పెడితే భవిష్యత్తులో వారు ఆరోగ్యంగా ఉంటారు. పెద్దవాళ్లుగా పెరిగిన తర్వాత అలవాటు లేకుండా ఉంటే తినడం కష్టం అవుతుంది. అందుకే తల్లిదండ్రులు చిన్నప్పుడే మంచి అలవాట్లు నేర్పాలి.
ఆకుకూరలు - ఆరోగ్య ప్రయోజనాలు
May 01, 2025
0
Tags