ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ భారత సైన్యం విజయాన్ని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తక్కువ చేసి మాట్లాడటం దుర్మార్గమని అన్నారు. సైన్యం విజయాన్ని దేశమంతా పండుగ చేసుకుంటుంటే రేవంత్‌రెడ్డికి అది భాజపా కార్యక్రమంగా కనిపిస్తుందా అని మండిపడ్డారు. ''మన ఎంపీలు పార్టీలను పక్కన పెట్టి ప్రపంచమంతా తిరుగుతున్నారు. 'ఆపరేషన్ సిందూర్' ఎందుకు చేయాల్సి వచ్చిందో ప్రపంచానికి చెబుతున్నారు. అసలు పీవోకేను పాకిస్తాన్‌కు ఎవరు ఇచ్చారు?. కాంగ్రెస్ కారణంగానే పీవోకే అంశం రావణ కాష్టంగా రగులుతూనే ఉంది. ఉగ్రవాదులు దాడి చేస్తే గత కాంగ్రెస్ ప్రభుత్వాల్లాగా సంతాపాలతో సరిపుచ్చుకోలేదు. పాక్ భూభాగంలోకి వెళ్లి మరీ సర్జికల్ స్ట్రైక్ చేసింది మోడీ సర్కారు. పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్‌కు ఎలా నరకం చూపించామో ప్రపంచం చూసింది''అని కిషన్‌రెడ్డి అన్నారు.
భారత సైన్యం విజయాన్ని రేవంత్‌రెడ్డి తక్కువ చేసి మాట్లాడటం దుర్మార్గం : కిషన్‌రెడ్డి
May 30, 2025
0
Tags