రోజంతా తమ గర్ల్ ఫ్రెండ్, భార్యలతో కలిసి హోటల్ లో ఎంజాయ్ చేసిన ఖైదీలు

Telugu Lo Computer
0


రాజస్థాన్ లోని జైపూర్ సెంట్రల్ జైల్లో ఉంటున్న ఐదుగురు ఖైదీలు ఓ రోజంతా తమ గర్ల్ ఫ్రెండ్, భార్యలతో కలిసి హోటల్ లోఎంజాయ్ చేశారు. ఇది కాస్త వెలుగులోకి రావడంతో మొత్తం 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో నలుగురు ఖైదీలు, నలుగురు వారి రిలేటివ్స్, ఐదుగురు పోలీసులున్నారు. విచారణలో పోలీసులకే లంచం ఇచ్చి మరి ఖైదీలు ఈ ప్లాన్ వేసినట్లుగా తేలింది. రఫీక్ బక్రి, భన్వర్ లాల్, అంకిత్ బన్సాల్, కరణ్ గుప్తా అనే ఖైదీలను జైపూర్ లోని ఎస్ఎంఎస్ ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసమని పోలీసులు బయటకు తీసుకువెళ్లారు. అయితే రోజంతా లీజర్ ఉండేలా పోలీసులకు రూ. 25 వేలు లంచం ఇచ్చి సెటిల్ మెంట్ చేసుకున్నారు. దీంతో ఐదు మందిలో ఒకరు మాత్రమే ఆరోజు హాస్పిటల్ లో చెకప్ కు వెళ్లినట్లు జైలు అధికారులు తెలిపారు.శనివారం సాయంత్రం 5.30 గంటల వరకు కూడా నలుగురు రాకపోవడం అనుమానాలకు దారితీసింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రఫీక్ తన భార్యను, భన్వర్ లాల్ తన ఎక్స్-గర్ల్ ఫ్రెండ్ ను జలుపుర హోటల్ మీట్ అయ్యారు. ఆ డే అంతా హోటల్ లో గడిపినట్లుగా అధికారులు గుర్తించారు. రఫీక్ భార్య నార్కోటిక్ టెస్ట్ లో పాజిటివ్ గా తేలింది. డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ కావటంతో అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ తేజశ్విని గౌతమ్ వెల్లడించారు. అంకిత్, కరణ్ అనే ఇద్దరు ఖైదీలు ఎయిర్ పోర్ట్ కు దగ్గర్లోని ఓ హోటల్ లో పోహా తీసుకున్నట్లు సీసీటీవీలో రికార్డు అయింది. వీళ్లిద్దరికీ ఆ హోటల్ రూమ్ బుక్ చేసింది అంకిత్ గర్ల్ ఫ్రెండ్ కావడం విశేషం. అయితే ఖైదీలకు ఔటింగ్ ఏర్పాటు చేసింది జైలులో ఉన్న ఓ సీనియర్ అధికారినే అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏప్రిల్ నెలలో మొత్తం 200 ఫోన్ కాల్స్ జైలు అధికారి మాట్లాడినట్లుగా గుర్తించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)