అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని లాంకస్టర్ కౌంటీలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారత యువకులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను సౌరవ్ ప్రభాకర్ (23), మానవ్ పటేల్ (20)గా గుర్తించారు. వీరిద్దరూ ఒహాయోలోని క్లీవ్‌ల్యాండ్ స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. ఘటన సమయంలో వారు మరో వ్యక్తితో కలిసి కారులో ప్రయాణిస్తున్నట్టు సమాచారం. సౌరవ్ వాహనాన్ని నడుపుతుండగా కారు అదుపుతప్పి రోడ్డుపక్కనున్న చెట్టును ఢీకొట్టిందని అంటున్నారు. తీవ్రంగా దెబ్బతిన్న కారు ఒక వంతెన మధ్యలో ఇరుక్కుపోయిందని వెల్లడించారు. ఈ ఘోర ప్రమాదంలో సౌరవ్, మానవ్ ఇద్దరూ అక్కడికక్కడే మరణించగా.. కారులో ఉన్న మూడో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితిపై సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
అమెరికా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి
May 13, 2025
0
Tags