ఆప్ఘనిస్తాన్ లో ​చెస్​ను బ్యాన్​ చేసిన తాలిబన్ ప్రభుత్వం !

Telugu Lo Computer
0


ప్ఘనిస్తాన్ లో ​చెస్​ను బ్యాన్​ చేస్తున్నట్లు తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. మతపరమైన కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. తొలుత మే 11న చెస్ గేమ్​ను నిలిపివేస్తున్నట్లు యంత్రాంగం తెలిపింది. ఆ తర్వాత ఆటపై ఏకంగా బ్యాన్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇస్లామిక్ చట్టం ప్రకారం ఈ ఆటపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది. ఈ సమస్యను పరిష్కరించే వరకూ చెస్​ పై నిషేధం కొనసాగుతుందని చెప్పింది. ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుంచి సాంస్కృతిక, సామాజిక, క్రీడా కార్యక్రమాలపై ఆంక్షలు విధిస్తూన్నారు. ఈ నేపథ్యంలో చెస్​పై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతకంటే ముందు చెస్​ను కొనసాగించాలని క్రీడా మంత్రిత్వ శాఖను కొంతమంది క్రీడాకారులు కోరారు. అయితే అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారి ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఒకప్పుడు అఫ్గానిస్థాన్​లో చెస్​ మేధో క్రీడగా పరిగణించేవారు. ఇటీవల కాలంలో చెస్​ ఆడేవారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. అయితే తాలిబన్ ప్రభుత్వం సాంస్కృతిక, వినోద కార్యకలాపాలను పరిమితం చేయడానికే నిషేధ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)