లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన ఈడీ డిప్యూటీ డైరెక్టర్‌

Telugu Lo Computer
0


డిశాలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌  డిప్యూటీ డైరెక్టర్‌ రఘువంశీ రూ.20 లక్షలు లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుబడ్డారు. 2013 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్) అధికారి అయిన రఘువంశీ, ఓ మైనింగ్ కేసుకు సంబంధించి భువనేశ్వర్‌కు చెందిన ఓ వ్యాపారి వద్ద నుంచి రూ. 20 లక్షల లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కారు. ఏడాదిన్నరగా రఘువంశీ భువనేశ్వర్ జోనల్ కార్యాలయంలో ఈడీ డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రఘువంశీని అరెస్ట్ చేసిన అధికారులు భువనేశ్వర్‌లోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)