గూడూరు మురుగుకాలువలో గర్భస్థ శిశువుల మృతదేహాలు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ ప్రాంతంలో శిశువుల మృతదేహాలు మురుగుకాలువలో పడేసిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. కాలువలో చెత్త తొలగిస్తుండగా కవల శిశువుల మృతదేహాలను పారిశుద్ధ్య సిబ్బంది, స్థానికులు గుర్తించారు. దీంతో వారు ఒకటో పట్టణ పోలీసులకి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గర్భస్రావం జరిగి ఎవరైనా తీసుకొని వచ్చి కాలువలో పడేశారా? లేక ప్రేమ పేరుతో మోసపోయి, గర్భం దాల్చిన తర్వాత అబార్షన్ చేయించుకొని పడేశారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

Post a Comment

0Comments

Post a Comment (0)